తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎరువుల వాడకం తగ్గించి.. భూమాతను రక్షించండి'

నేల తల్లిని రక్షించేందుకు రైతులు క్రమక్రమంగా ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. రసాయనాల వాడకంతో.. మాతృభూమి నాశనం అవుతోందని ఎర్రకోట వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు.

By

Published : Aug 15, 2019, 1:16 PM IST

Updated : Sep 27, 2019, 2:21 AM IST

'ఎరువుల వాడకం తగ్గించి.. భూమాతను రక్షించండి'

'ఎరువుల వాడకం తగ్గించి.. భూమాతను రక్షించండి'

భూమికి హాని చేసే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. వీలుంటే పూర్తిగా నిషేధించేందుకు ప్రయత్నించాలని కోరారు.

భారత్​లో ఏటా సగటున 55 మిలియన్​ టన్నుల యూరియా, ఇతర రసాయనాలు వినియోగిస్తున్నారని చెప్పారు మోదీ. పురుగుమందులు ఇందుకు అదనమని వివరించారు. ఇవన్నీ భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు ప్రధాని.

''భూమాత ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నామా...? భారీగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమాతను నాశనం చేస్తున్నాం. భూ మాత బిడ్డలుగా, రైతులుగా నేలతల్లిని దెబ్బతీసే అధికారం మనకు లేదు. భూ మాతను ఏడిపించే, రోగగ్రస్తం చేసే హక్కు లేదు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.... బాపూ చూపిన మార్గంలో పయనిస్తూ పొలాల్లో 10, 20, 25 శాతం రసాయన ఎరువుల వాడకం తగ్గిద్దాం. వీలైతే పూర్తిగా నిషేధిద్దాం.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మోదీ.

ఇదీ చూడండి:'70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'

Last Updated : Sep 27, 2019, 2:21 AM IST

ABOUT THE AUTHOR

...view details