తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సామాన్యుడి నుంచి శక్తిమంతమైన నేతగా...

కుటుంబపరంగా రాజకీయ నేపథ్యం లేదు. చుట్టూ ఉన్నవారిని సులువుగా ప్రభావితం చేయగల ఆర్థిక, సామాజిక ప్రాభవం అసలే లేదు. ఉన్నదల్లా... దేశ సేవ చేయాలన్న తపన. ఆ ఆలోచనే... 'అతి సామాన్యుడు' నరేంద్రమోదీని 'అసాధారణ నేత'గా చేసింది.

By

Published : May 30, 2019, 7:18 PM IST

నమో

నరేంద్రమోదీ చిన్న వయసులోనే ఇంటిని వదిలి, హిమాలయాలు, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు చుట్టొచ్చారు. అనంతరం రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్​ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1972లో ఆరెస్సెస్​లో చేరి, రాజకీయ జీవితానికి నాంది పలికారు.

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీతో వెలుగులోకి..

1975-77లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ రోజుల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి, వాటిని పంపిణీ చేశారు నరేంద్ర మోదీ. ఈ సందర్భంలోనే మోదీలోని నాయకత్వ లక్షణాలు, నిర్వహణ, సంస్థాగత నైపుణ్యాలు అందరికీ తెలిశాయి.

రాజకీయ ప్రస్థానం

  • 1985లో భాజపాలోకి ప్రవేశం
  • 1987లో భాజపా గుజరాత్​ విభాగం​ ఆర్గనైజేషన్​ సెక్రటరీగా నియామకం
  • అహ్మదాబాద్​ నగర పంచాయతీ ఎన్నికల్లో తొలి విజయం.
  • 1990లో అడ్వాణీ అయోధ్య రథ ​యాత్రలో కీలకపాత్ర
  • 1991-92లో మురళీమనోహర్​ జోషి ఏక్తా యాత్రలోనూ కీలకం
  • 1995లో భాజపా జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు
  • 1998లో అంతర్గత రాజకీయ వివాదాలు పరిష్కరించి, లోక్​సభ ఎన్నికల్లో భాజపా విజయానికి మోదీ తోడ్పాటు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం.
  • 2002లో గుజరాత్​ శాసనసభ ఎన్నికల్లో రాజ్​కోట్​-2 నియోజకవర్గం నుంచి గెలుపు- తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన మోదీ.
  • గుజరాత్​ అల్లర్లు, ప్రతిపక్షాల విమర్శలు, అధిష్ఠాన ఒత్తిడితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా.
  • అదే సంవత్సరం డిసెంబర్​ ఎన్నికల్లో గెలిచి, తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు.
  • 2014 ఎన్నికల్లో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా వారణాసి, వడోదర నుంచి విజయం.
  • 2014 మే 26న 14వ ప్రధానిగా బాధ్యతల స్వీకరణ.
  • 2019 మే 30న ప్రధానిగా మరోమారు ప్రమాణస్వీకారం.

ఇదీ చూడండి: మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!

ABOUT THE AUTHOR

...view details