తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత సంస్కృతి, సంప్రదాయాలకు పతాకధారి మోదీ' - Protesters release black balloons ahead of Amit Shah's Hubballi visit

ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. బెంగళూరు హుబ్బళ్లి వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా భారత సంస్కృతి, సంప్రదాయాలకు పతాకధారి అని కొనియాడారు. హుబ్బళ్లి  పర్యటన సందర్భంగా పౌరచట్టం, ఎన్​ఆర్​సీలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంటూ పలువురు నిరసనలు చేపట్టారు.

shah
మోదీ భారతీయ పతాకధారి: అమిత్​షా

By

Published : Jan 18, 2020, 5:16 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ ​షా. బెంగళూరు హుబ్బళ్లి వేదికగా జరిగిన ఓ కార్యక్రమం వేదికగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మోసుకెళ్లే పతాకధారి మోదీ అని వ్యాఖ్యానించారు.

ప్రధానిగా ప్రమాణస్వీకారానికి ముందు గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి, గంగా హారతి ఇచ్చిన సందర్భమే తన వ్యాఖ్యలకు ఆధారమని గుర్తు చేశారు అమిత్​ షా. నేపాల్​లోని పశుపతినాథ్ ఆలయానికి భారత ప్రభుత్వం తరఫున పూజాద్రవ్యాలను పంపిన తొలి ప్రధాని మోదీ అని అన్నారు. అనేక ఏళ్ల విరామం తర్వాత ప్రపంచానికి భారత్ చాలా ఇవ్వగలదని నిరూపించారు కొనియాడారు.

లౌకికవాదంపై

గత ప్రభుత్వాలు లౌకికవాదాన్ని తప్పుడు భాష్యం చెప్పాయని ఆరోపించారు షా. నాటి ప్రభుత్వాల తప్పుడు అవగాహనే వారిని దేశంలోని అత్యున్నత గౌరవాలు అందుకోకుండా నిలువరించిందని వ్యాఖ్యానించారు.

హోంమంత్రికి నిరసన సెగ

అమిత్​షా హుబ్బళ్లి పర్యటన సందర్భంగా పౌరచట్టం, ఎన్​ఆర్​సీలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంటూ సంవిధాన సంరక్షణ సమితి కార్యకర్తలు నిరసన చేపట్టారు. అమిత్​షా గో బ్యాక్ అంటూ నల్లని బెలూన్లతో ఆందోళన చేశారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: 'సైన్యంలో వృత్తి నైపుణ్యత'ను మెరుగుపరచడం ఎలా?

ABOUT THE AUTHOR

...view details