ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకులను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ఆయన అభిమానులు, భాజపా కార్యకర్తలు. ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని ఓ అభిమాని.. మోదీ పుట్టిన రోజు సందర్భంగా సంకట్ మోచన్ ఆంజనేయ స్వామికి 1.25కిలోల స్వర్ణ కిరీటాన్ని సోమవారం సమర్పించాడు.
మోదీ పుట్టిన రోజున స్వర్ణ కిరీటం బహూకరణ - hunumantemple
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ వారణాసిలో హనుమంతుని ఆలయానికి 1.25కిలోల స్వర్ణ కిరీటాన్ని బహూకరించాడు ఆయన అభిమాని. మోదీ రెండోసారి ప్రధాని అయినందుకు కిరీటాన్ని అందించినట్లు తెలిపాడు.
హనుమంతునికి మోదీ అభిమాని 1.25కిలోల 'స్వర్ణ కిరీటం'
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ రెండోసారి ప్రధాని అయితే స్వర్ణ కిరీటం తయారు చేయించి బహుమతిగా ఇస్తానని మెుక్కుకున్నట్టు చెప్పాడు అరవింద్ సింగ్. మోదీ జన్మదినం సందర్భంగా మొక్కు తీర్చుకునందుకు ఆనందంగా ఉందన్నాడు.
ఇదీ చూడండీ:జమ్ముకశ్మీర్లో 'మోదీ బర్త్డే' సంబరాలు
Last Updated : Sep 30, 2019, 10:17 PM IST