ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో పేదల నుంచి సంపదను సేకరించి తన పెట్టుబడిదారీ మిత్రులకు అందిస్తున్నారని ఆరోపించారు. దేశంలో సంపద కేంద్రికరణపై ఆక్స్‌ఫామ్ ఇచ్చిన నివేదికపై స్పందించిన రాహుల్.. పెట్టుబడిదారులకు దేశ సంపద దోచి పెడుతున్నారని ట్విట్టర్‌లో ఆక్షేపించారు.
'ప్రధాని.. బడా మిత్రులకు పేదల సొమ్ము బట్వాడా' - ప్రధాని...బడా మిత్రులకు పేదల సొమ్మును బట్వాడా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలోని పేదల సొమ్మును సేకరించి కార్పొరేట్ మిత్రులకు బట్వాడా చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని సంపద కేంద్రీకరణపై ఆక్స్‌ఫామ్ ఇచ్చిన నివేదికపై స్పందిస్తూ రాహుల్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ప్రధాని...బడా మిత్రులకు పేదల సొమ్మును బట్వా
భారత్‌లో 1శాతం ధనికుల సంపద, 70శాతం దేశ ప్రజల ఆదాయం కన్న నాలుగు రెట్లు అధికమని ఆక్స్‌ఫామ్ సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక సదస్సుసోమవారం ప్రారంభం అయిన నేపథ్యంలో... ఆక్స్‌ఫామ్ తన నివేదికను విడుదల చేసింది. భారత్లోని తొలి 63 మంది బిలియనీర్ల సంపద కలిపితే.. 2018-19 ఏడాదిలో దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ అని నివేదికలో పేర్కొంది. ధనిక, పేద అంతరం ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరుగుతోందని ఆక్స్‌ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: కోర్టు బయట రాజ్యాంగ పీఠిక చదివిన లాయర్లు.. కారణమిదే!
Last Updated : Feb 17, 2020, 6:51 PM IST