ఫొని తుపాను ప్రభావంపై బంగాల్ ముఖ్యమంత్రితో చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నించారని... కానీ మమతా బెనర్జీ స్పందించలేదని ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ముఖ్యమంత్రితో సంభాషణ కుదరకపోవడం వల్ల ఆ రాష్ట్ర గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠితో మోదీ చర్చలు జరిపారని స్పష్టం చేశారు.
"మమతతో ఫోనులో మాట్లాడటానికి ప్రధాని రెండుసార్లు ప్రయత్నించారు. కానీ ఆ రెండు సార్లూ ముఖ్యమంత్రి తిరిగి సంప్రదిస్తారనే సమాధానమొచ్చింది. ఒకసారైతే ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారని అన్నారు."
- ఉన్నతాధికారి.