మహారాష్ట్రలోని ధూలెలో పర్యటించారు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. పుల్వామా ఘటన అనంతరం మోదీ తమపై విమర్శలు చేయటంపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు.
ఐదు నిమిషాల సవాల్
మోదీకీ ధైర్యముంటే ఐదు నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సవాల్ విసిరారు రాహుల్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించలేదని అన్నారు.
పుల్వామా ఘటన అనంతంరం ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని, అందరు ఏకతాటిపై నిలబడాలని కార్యకర్తలకు సూచించామని అన్నారు రాహుల్. ప్రధాని మోదీ మాత్రం దిల్లీలో యుద్ధ స్మారకం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని గుర్తు చేశారు.
నోట్ల రద్దుతో ఏం సాధించారు?
ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటన అనంతరం నల్లధనం బయటకు వస్తుందనుకున్న ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందని రాహుల్ వ్యాఖ్యానించారు. "సాధారణ ప్రజలు మాత్రమే బ్యాంకుల ముందు బారులు తీరారు. అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు" అని విమర్శించారు.
పేదలకు కనీస ఆదాయం