ప్రపంచమంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు సార్క్ దేశాధినేతలు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సార్క్ దేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాలని సూచించారు.
ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా వైరస్‌తో పోరాడుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రజలు ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సార్క్ దేశాధినేతలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నా.