తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎస్పీ ప్రభుత్వం వల్లే' - uttar prdessh

ఉత్తరప్రదేశ్​లో గత ఎస్పీ ప్రభుత్వం సహకరించనందునే అభివృద్ధి పనులకు ఆలస్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్​ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన.

'ఎస్పీ ప్రభుత్వం వల్లే'

By

Published : Mar 8, 2019, 1:41 PM IST

సొంత నియోజక వర్గంలోని కాశీ విశ్వనాథుని ఆలయ అభివృద్ధి​ పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వారణాసి అభివృద్ధికి గత సమాజ్​వాదీ పార్టీ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. అందుకే అభివృద్ధి పనులకు ఆలస్యమైందని అన్నారు.

కాశీకి ప్రపంచ గుర్తింపు లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు మోదీ. ఉత్తరప్రదేశ్​ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్​ బాధ్యతలు చేపట్టాకే అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ప్రశంసించారు.

'ఎస్పీ ప్రభుత్వం వల్లే'

"నేను అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలో అప్పటి యూపీ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ అభివృద్ధి పనులన్నీ ఈ పాటికే పూర్తయ్యేవి. ఆ మూడేళ్లలో పరస్పర సహకారం లేదు. అందుకే అభివృద్ధి పనులు చేపట్టలేక పోయాం. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక వారణాసి అభివృద్ధి పనుల్లో పురోగతి లభించింది. "

-నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి

ABOUT THE AUTHOR

...view details