తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గత పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీక పీఓకే: మోదీ - జమ్ముకశ్మీర్​కు అన్యాయం జరిగిందన్నమోదీ

హరియాణాలోని సిర్సాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విపక్షాలే లక్ష్యంగా విమర్శనాస్త్రాలను సంధించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్లే పీఓకే ఏర్పడిందని ఆరోపించారు.

గత పాలకుల నిర్లక్షానికి ప్రతీక పీఓకే: మోదీ

By

Published : Oct 19, 2019, 1:20 PM IST

Updated : Oct 19, 2019, 4:24 PM IST

కాంగ్రెస్​ తప్పిదాల వల్ల జమ్ముకశ్మీర్​ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు ప్రధాని మోదీ. గత ప్రభుత్వాల తప్పిదం వల్లే పాక్​ ఆక్రమిత కశ్మీర్​ ఏర్పడిందని విమర్శించారు మోదీ. కొన్ని కుటుంబాల లబ్ధి కోసం కశ్మీర్​ ప్రజల అభివృద్ధిని పక్కనపెట్టారన్నారు ప్రధాని.

హరియాణాలోని సిర్సాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ఆర్టికల్​ 370 తాత్కాలికమే అయినా.. కాంగ్రెస్​ ప్రభుత్వం దాన్ని ఏమీ చేయలేకపోయిందని పేర్కొన్నారు. ప్రధాని బాధ్యతలు అప్పగించి తనను శాశ్వతం చేసిన ప్రజలకు.. ఇలాంటి తాత్కాలిక పద్ధతులను ఎలా ఉంచగలనని ఉద్ఘాటించారు ప్రధాని.

'గత పాలకుల నిర్లక్షానికి ప్రతీక పీఓకే'

"దిల్లీలో ప్రభుత్వం పడుకోవడం వల్ల కశ్మీర్​ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రారంభ దశల్లో పాకిస్థాన్​ మద్దతుతో మనలోని కొంత భాగాన్ని దొంగిలించారు. అది పీఓకేగా మారింది. భారత్​ దేన్ని చూసి గర్వపడుతుందో, ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ఉపయోగపడిందో, జమ్ముకశ్మీర్​ దేనికైతే ప్రతీకగా నిలిచేదో.. ఆ సూఫీ సంప్రదాయాన్ని కొన్నేళ్ల తర్వాత హతమార్చారు. సూఫీ ఆలోచనలను నాశనం చేశారు. సూఫీ సంప్రదాయాన్ని చంపి కశ్మీర్​ను దెబ్బతీశారు. మెల్లమెల్లగా ఈ దుస్థితి ఇంకా ముందుకు సాగింది. ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా.. దిల్లీలో కూర్చున్న పెద్దలకు కనపడలేదు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం ఎన్​డీఏ ప్రభుత్వ హయాంలో జరగడం ఎంతో గౌరవంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సిక్కు గురువు గురు నానక్​ పవిత్ర స్థలాన్ని 70ఏళ్లుగా దూరం నుంచి బైనాక్యులర్లతో చూసే దుస్థితి నుంచి ఎట్టకేలకు విముక్తి లభించిందన్నారు మోదీ. దేశ విభజన సమయంలో కర్తార్​పుర్​ సాహెబ్​ గురుద్వారా భారత్​కు దక్కకపోవడానికి కాంగ్రెస్​ బాధ్యత వహించాలన్నారు.

Last Updated : Oct 19, 2019, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details