తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ బయోపిక్​ విడుదల కష్టమేనా.! - narendra modi

మోదీ బయోపిక్ విడుదలపై తుది నిర్ణయాన్ని నేడు సుప్రీం కోర్టుకు నివేదించనుంది ఎన్నికల సంఘం. సుప్రీం సూచన మేరకు చిత్రాన్ని చూసిన ఈసీ సభ్యులు.. వివరాలను సీల్డ్​ కవర్​లో కోర్టుకు అందించనున్నారు.

మోదీ బయోపిక్​ విడుదల కష్టమేనా!

By

Published : Apr 20, 2019, 6:54 AM IST

Updated : Apr 20, 2019, 7:15 AM IST

మోదీ బయోపిక్​ విడుదల కష్టమేనా!

మోదీ బయోపిక్​ భవితవ్యంపై సుప్రీం కోర్టుకు నేడు ఎన్నికల సంఘం వివరించనుంది. సుప్రీం ఆదేశాల మేరకు చిత్రాన్ని చూసిన ఈసీ తన తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్​లో కోర్టుకు సమర్పించనుంది. మోదీ చిత్రంపై తన వైఖరిని మార్చుకునే ఆలోచనలో ఈసీ లేదని సమాచారం.

మోదీ బయోపిక్​పై శుక్రవారమే నివేదిక ఇవ్వాల్సి ఉంది. గుడ్​ఫ్రైడే రోజు కోర్టు రిజిస్ట్రార్​కు సెలవు కావటం వల్ల వాయిదా వేసింది ఈసీ. మోదీ చిత్రంపై తీసుకున్న తుది నిర్ణయంపై ఈసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఒక్క రోజు ముందే నిషేధం

మోదీ బయోపిక్​పై కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి. పరిశీలించిన ఈసీ.. ఏప్రిల్​ 11న విడుదల కావాల్సిన చిత్రాన్ని ఒక్క రోజు ముందు నిషేధించింది. ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్​ సరళిపై ప్రభావం చూపే సినిమాలపై నిషేధం ఉంటుందని ప్రకటించింది.

ఈసీ నిర్ణయంపై నిర్మాతలు కోర్టుకెక్కారు. అభ్యర్థనను పరిశీలించిన సుప్రీం పూర్తి చిత్రాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈసీ అధికారులు బుధవారం చిత్రాన్ని చూశారు. చిత్ర నిర్మాతలు కూడా వారి అభిప్రాయాలను ఈసీకిగురువారం సమర్పించారు.

వివేక్​ ఒబెరాయ్​ ప్రధాన పాత్రలో ఒమంగ్​ కుమార్​ దర్శకత్వంలో 'పీఎం నరేంద్రమోదీ' చిత్రం తెరకెక్కింది.

Last Updated : Apr 20, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details