తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​-అమెరికా మైత్రిలో సరికొత్త అధ్యాయం' - డొనాల్డ్ ట్రంప్ విజిట్ అహ్మదాబాద్ 2020

మోటేరా స్టేడియంలో నమస్తే ట్రంప్​ కార్యక్రమం ఘనంగా మొదలైంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​కు మోదీ సహా యావత్​ మోటేరా స్టేడియం అదిరిపోయే స్వాగతమిచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత్-​ అమెరికా మైత్రి బంధం కలకాలం వర్థిల్లాలని ఆకాంక్షించారు.

MODI AT NAMASTE TRUMP EVENT
'భారత్​-అమెరికా మైత్రిలో సరికొత్త అధ్యాయం'

By

Published : Feb 24, 2020, 2:10 PM IST

Updated : Mar 2, 2020, 9:45 AM IST

భారత్‌-అమెరికా మైత్రిబంధం కలకాలం వర్థిల్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మోటేరా స్టేడియం నవ శకం ఆరంభానికి వేదికగా నిలుస్తోందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనస్ఫూర్తిగా అమెరికా అధ్యక్షుడి ట్రంప్​కు స్వాగతం పలుకుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

అహ్మదాబాద్​ మోటేరా స్టేడియంలో నమస్తే ట్రంప్​ కార్యక్రమాన్ని మోదీ స్వాగతం ప్రసంగంతో ఆరంభించారు.

'భారత్​-అమెరికా మైత్రిలో సరికొత్త అధ్యాయం'

"భారత్‌-అమెరికా మైత్రిబంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం. గుజరాత్‌ మాత్రమే కాదు.. యావద్దేశం ట్రంప్​కు స్వాగతం పలుకుతోంది. భారత్‌, అమెరికా ఎన్నో విషయాల్లో సారూప్యత కలిగి ఉన్నాయి.

భారత్‌-అమెరికా సంబంధాల్లో ట్రంప్‌ పర్యటన ఓ మైలురాయి. అమెరికా కోసం అధ్యక్షుడు ట్రంప్‌ ఎంతో ఆలోచిస్తారు. అమెరికా పునర్‌వైభవం కోసం ఆయన కృషి ప్రపంచం మొత్తానికి తెలుసు.

ఆరోగ్యకరమైన, సంతోషకరమైన అమెరికా కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇవాంకా ట్రంప్‌ భారత్‌కు వచ్చారు. గతసారి వచ్చినప్పుడు మళ్లీ రావాలని ఇవాంకా కోరుకున్నారు. ఇవాళ యావత్‌ ప్రపంచం ట్రంప్‌ ప్రసంగం కోసం ఎదురుచూస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌ భారతదేశానికి మంచి స్నేహితుడు"

- నరేంద్ర మోదీ, ప్రధాని

Last Updated : Mar 2, 2020, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details