తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముల్లోకాల్లో మెరుపుదాడులు మాకే సాధ్యం'

మేరట్​లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ... సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం కేవలం భాజపాకే సాధ్యమన్నారు. కాంగ్రెస్​ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై విమర్శలు చేశారు.

By

Published : Mar 28, 2019, 1:43 PM IST

Updated : Mar 28, 2019, 4:04 PM IST

'ముల్లోకాల్లో మెరుపుదాడులు మాకే సాధ్యం'

ముల్లోకాల్లో మెరుపుదాడులు చేసే సత్తా కేవలం భాజపా ప్రభుత్వానికే ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారాయన. మేరట్​లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న మోదీ... ఎన్​డీఏ చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తూనే, విపక్షాల వైఫల్యాలను ఎండగతానని చెప్పారు.

2014లోనూ మేరట్​ నుంచే భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మోదీ.

దేశ ప్రజలు ఎవరిని గెలిపించాలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాలనలో తాను చేసిన పనులకు లెక్కలు చెబుతానని, ప్రత్యర్థుల లెక్కలూ తేలుస్తానని వ్యాఖ్యానించారు. చౌకీదార్​ ఎవరికీ అన్యాయం చేయడని అన్నారు.

కాంగ్రెస్​ హామీ ఇచ్చిన కనీస ఆదాయ పథకాన్ని మోదీ తప్పుబట్టారు. కనీసం బ్యాంకు ఖాతాలు తెరవలేని వారు, ఇప్పుడు పేదలకు సొమ్ము ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు.

ఈ సార్వత్రిక ఎన్నికలు నిర్ణయాత్మక ప్రభుత్వానికి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన వారికి మధ్య జరిగే పోటీ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

మేరట్​లో మోదీ ప్రసంగం

"ఈరోజున ఒకవైపు దేశాభివృద్ధి ఉంది. మరోవైపు నీతి, నిజాయితీ లేని వారు కనపడుతున్నారు. ఒకవైపు సమర్థమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది. మరోవైపు దశాబ్దాలుగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన వారున్నారు. ఒక వైపు బలమైన చౌకీదార్​ ఉన్నాడు. మరోవైపు కళంకితుల కూటమి ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని

Last Updated : Mar 28, 2019, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details