తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వర్తమాన రాజకీయాలకు దూరంగా...' - పర్యటన

సమాచార వ్యవస్థ సరిగా లేని కారణంగా వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం కలిగిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఉత్తరాఖండ్​ కేదార్​నాథ్​ ఆలయ పరిసరాల్లో శనివారం ప్రారంభించిన ధ్యానాన్ని  17 గంటల అనంతరం నేటి ఉదయం ముగించారు.

'వర్తమాన రాజకీయాలకు దూరంగా...'

By

Published : May 19, 2019, 10:09 AM IST

Updated : May 19, 2019, 10:56 AM IST

కేదార్​నాథ్​ యాత్ర రూపంలో వర్తమాన రాజకీయాలకు దూరంగా గడిపే అవకాశం వచ్చిందని చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. రుద్రగుహలో ఏకధాటిగా 17గంటలు ధ్యానం చేసిన మోదీ... ఉదయం బయటకు వచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన ప్రజలతో మమేకమయ్యారు.

కేదార్​నాథ్​ సందర్శనకు అనుమతి ఇచ్చినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని.

'వర్తమాన రాజకీయాలకు దూరంగా...'

"ఆధ్యాత్మిక శోభ కలిగిన కేదార్​నాథ్​ ఆలయాన్ని సందర్శించేందుకు కొన్నేళ్లుగా అవకాశం వస్తోంది. కేదార్​నాథ్​కు గతంలో నేను వచ్చినప్పుడు హృదయంలో ఒక భారం ఉండేది... ఏదైనా చేయాలని. గుజరాత్​ కేంద్రంగా ఉంటూ పనిచేసేవాడిని. ప్రధానిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఉత్తరాఖండ్​లోనూ అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. కేదార్​నాథ్ అభివృద్ధి కోసం ఓ బృహత్​ ప్రణాళిక తయారు చేశాం. దాని ఆధారంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సమయం ఉంటే ఇక్కడి అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తాను. ప్రస్తుతం ఒక విధంగా భారత్​లోని వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎలాంటి సమాచారం లేని స్థితిలో ఉన్నాను. నాకు నేనుగా ఉన్నాను."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మోదీ గత రెండేళ్లలో చార్​ధామ్ క్షేత్రాలను సందర్శించడం ఇది నాలుగోసారి.

ఇదీ చూడండి: ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉన్న పోలింగ్​ కేంద్రం ఇదే..

Last Updated : May 19, 2019, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details