సౌదీలో విజయవంతంగా ముగిసిన మోదీ పర్యటన సౌదీ అరేబియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. సౌదీ రాజు, యువరాజుతో భేటీ, భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులో కీలక ప్రసంగం తర్వాత దిల్లీకి వచ్చారు మోదీ.
రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌తో పాటు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తోనూ భేటీ అయ్యారు. భారత్- సౌదీఅరేబియా మధ్య పరస్పర సహకారం కోసం వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మరో 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
పెట్టుబడుల సదస్సులో..
రియాద్‌లో జరిగిన భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులోనూ మోదీ ప్రసంగించారు. భారత్‌లోని అంకురసంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచాన్ని కోరారు. వచ్చే ఐదేళ్లలో చమురు, గ్యాస్ రంగంలో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
సౌదీలోనూ రూపే కార్డులు వినియోగించేలా ఒప్పందం కుదిరింది. దీనిద్వారా అక్కడున్న 26 లక్షల మందితోపాటు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారికి ఉపకరిస్తుందని మోదీ తెలిపారు.
ఇదీ చూడండి: సౌదీ అరేబియాతో భారత్ 12 ఒప్పందాలు..