మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశమంతటా కమలం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా భాజపా 'నమో' కొత్తయాప్‌ను ప్రారంభించి ఓ కానుకను అందించింది. 'బెటర్, ఫాస్టర్, స్లీకర్' ట్యాగ్ లైన్‌తో నమో కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. మోదీ జన్మదినాన్ని పండగలా సంబరాలు చేసుకునేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.
మోదీ జన్మదినాన దేశ ప్రజలకు భాజపా కానుక - నమో జన్మదినాన మోదీ యాప్ అప్‌డేట్
మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ 69వ పుట్టినరోజును జరుపుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని దేశ ప్రజలు, కార్యకర్తలకు ప్రత్యేక కానుక అందించింది భాజపా. నరేంద్ర మోదీ యాప్‌ను పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేసి.. కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది.
నమో జన్మదినాన మోదీ యాప్ అప్‌డేట్
వేగంగా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్‌తో యాప్‌ను రూపొందించారు. పాత వర్షన్ కంటే మరింత మెరుగ్గా మార్చేశారు. యాప్‌లో నమో ఎక్స్‌క్లూజివ్ అనే కంటెంట్ సెక్షన్‌ను పొందుపరిచారు. ఇందులో మోదీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడొచ్చు.
ఇదీ చూడండి : మహా పోరు: కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి
Last Updated : Sep 30, 2019, 8:47 PM IST