తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ములాయం సింగ్​కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు - శివ్​పాల్ యాదవ్

సమాజ్​ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్​ యాదవ్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆయనతో మాట్లాడానని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. యాదవ్​కు గ్రామీణాభివృద్ధిపై ఆసక్తి ఎక్కువని గుర్తుచేశారు.

mulayam singh birthday
ములాయం సింగ్​కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

By

Published : Nov 22, 2020, 4:45 PM IST

Updated : Nov 22, 2020, 5:04 PM IST

సమాజ్​ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యాదవ్​కు వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిపై మక్కువ ఎక్కువని కొనియాడారు.

'81 వ పుట్టినరోజు సందర్భంగా ములాయం సింగ్​ యాదవ్​తో మాట్లాడాను. ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. దేశంలో ఉన్న గొప్ప​ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. యాదవ్​ ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తున్నా' అని ప్రధాని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

'ఆయన ఆరోగ్యం బాగుండాలి'

ములాయం​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యాదవ్​ ఆరోగ్యం బాగుండేలా దీవించమని రాముడిని ప్రార్థిస్తానని పేర్కొన్నారు. ఈమేరకు హిందీలో ట్వీట్​ చేశారు యూపీ సీఎం.

ప్రగతిశీల్​ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ములాయం సింగ్​ తమ్ముడు శివ్​పాల్​ యాదవ్​ తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, సమాజానికి ఆయన.. ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​లో నాయకత్వ సంక్షోభం లేదు: ఖుర్షీద్

Last Updated : Nov 22, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details