తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ, అమిత్​షాలే మా టార్గెట్​: జైషే ఉగ్రవాద సంస్థ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్​ ఆధారిత ఉగ్రవాదులు భారత్​తో కయ్యానికి కాలు దువ్వాలని చూస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ, ఆమిత్​షా, డోభాల్​లను హిట్​ లిస్ట్​లో చేర్చామంటూ జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థ లేఖ పంపింది. దేశంలోని 30 నగరాల్లోనూ దాడి చేస్తామని లేఖలో హెచ్చరించింది.

మోదీ, అమిత్​షాలే మా టార్గెట్​: జైషే ఉగ్రవాద సంస్థ

By

Published : Sep 25, 2019, 2:53 PM IST

Updated : Oct 1, 2019, 11:33 PM IST

కశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దేశంలోని రైల్వే స్టేషన్లను పేల్చేస్తామని ఇటీవల లేఖ పంపిన జైషే మహ్మద్​ ఉగ్ర సంస్థ నేడు మరో లేఖ పంపింది.

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ను హిట్‌ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన విభాగం బ్యూరో సెక్రటరీకి లేఖ అందింది. ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రతీకారంగా ఈ పని చేసినట్లు జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ లేఖలో పేర్కొంది.మోదీ, అమిత్‌ షాపైనే కాకుండా మరో 30 నగరాల్లో దాడి చేస్తామని లేఖలో పేర్కొన్నారు.జైషే లేఖతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు నగరాల్లో హై అలెర్ట్‌ ప్రకటించారు.

Last Updated : Oct 1, 2019, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details