"క్షయ నిర్మూలనపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలతో పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. సరైన, పూర్తి చికిత్సతో క్షయను పూర్తిగా నిర్మూలించవచ్చు. క్షయ రహిత సమాజం కోసం పోరాటం చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు నా అభినందనలు" -నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
'2025 నాటికి క్షయ రహిత భారత్‌ను నిర్మిద్దాం' - MODI
2025 నాటికి భారత్‌ను క్షయరహిత దేశంగా మార్చేందుకు కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ క్షయ దినం సందర్భంగా ఇందుకు సంబంధించి మోదీ పలు ట్వీట్లు చేశారు.
'2025 నాటికి క్షయ రహిత భారత్‌ను నిర్మిద్దాం'
ప్రభుత్వం చేపట్టిన క్షయ రహిత భారత్ ప్రచారం, ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలో ఆరోగ్య ప్రమాణాల్ని పెంచుతాయని పేర్కొన్నారు మోదీ.