రఫేల్‌పై విపక్షాలు ఫెయిల్
రఫేల్‌పై కోర్టులో పూర్తిస్థాయి విచారణ జరిగిందని ప్రధాని అన్నారు. పార్లమెంటులో జరిగిన చర్చల్లో రఫేల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించినట్టు స్పష్టం చేశారు. కాగ్‌కూ, సుప్రీంకోర్టుకూ అవే విషయాలు తెలియజేశామని, అన్నిచోట్ల తమకు క్లీన్చిట్ లభించిందన్నారు. కానీ రాజకీయ లబ్ధికోసమే కొందరు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మోదీ. ఈ విషయంపై మీడియా వ్యవహరిస్తున్న తీరును ప్రధాని తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేని రఫేల్‌కు ఇచ్చినంత ప్రాధాన్యం... పూర్తి సాక్ష్యాధారాలున్న అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ కేసులకు ఎందుకు ఇవ్వడం లేదని మోదీ ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు బెయిల్‌పై ఎందుకు తిరుగుతున్నారన్న వార్తనూ మీడియా ఇవ్వకపోవడం సరికాదని తెలిపారు.