భారత్‌వైపే అందరి చూపు...
ఒక వర్గం తమ మనుగడ కోసం స్వార్థంతో దేశంలో తప్పుడు అజెండా ప్రచారం చేస్తోందని మోదీ విమర్శించారు. దిల్లీలో ఎన్నికలు జరిగినప్పుడు చర్చిలపై దాడులు జరుగుతున్నట్లు విస్తృత ప్రచారం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత అలాంటి వార్త ఒక్కటీ రాలేదని, అందుకే దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. సిక్కుల ఊచకోత సహా అనేక అల్లర్లు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని ఆరోపించారు. కానీ తమ పాలనలో వాతావరణం మారిందని, ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని మోదీ అన్నారు. ప్రజలు కలిసి మెలిసి ఎలా బతకాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలన్న మోదీ సౌదీ అరేబియా ఆర్టికల్‌ను ప్రస్తావించారు.
రామజన్మభూమిపై కాంగ్రెస్ రాజకీయం...
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై మేనిఫెస్టోలో చెప్పినట్టే చేశామని ప్రధాని స్పష్టం చేశారు. ఈ అంశంపై గత ప్రభుత్వాలు ఎన్నో అబద్ధాలు చెప్పాయని... తమ ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయి వాదనలు కోర్టు ముందుంచిందని మోదీ తెలిపారు. కానీ సార్వత్రిక ఎన్నికలంటూ సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు న్యాయవ్యవస్థపై రాజకీయపరమైన ఒత్తిడి తీసుకోచ్చారా అన్న అంశంపై చర్చ జరగాలని అన్నారు.
ఇవీ చూడండి:
'సొంతంగానే మెజార్టీ సాధిస్తాం- సుస్థిర పాలన అందిస్తాం'
రఫేల్‌పై మాకు ప్రతీచోటా క్లీన్చిట్: మోదీ
'సొంతంగానే మెజార్టీ సాధిస్తాం- సుస్థిర పాలన అందిస్తాం'
'కాపలాదారుడిగా దేశ ఖజానాను సంరక్షిస్తా'
'రమణ్ సింగ్‌ను చూసి బాబు నేర్చుకోవాలి'
రామజన్మభూమిపై కాంగ్రెస్ రాజకీయం...