తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోట్ల రద్దు విఫలం కాలేదు: ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగిన నోట్ల రద్దు వ్యవహారంలో తాము పొరపాటు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎవ్వరూ చేయడానికి సాహసించని పనిని తాను చేసి చూపించానన్నారు. నోట్ల రద్దుతో సమాంతర ఆర్థిక వ్యవస్థ రద్దయిందని ఆయన ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పారు.

నోట్ల రద్దు విఫలం కాలేదు: ప్రధాని మోదీ

By

Published : Apr 9, 2019, 6:28 AM IST

Updated : Apr 9, 2019, 9:07 AM IST

నోట్లరద్దు సక్సెస్

నోట్ల రద్దు వ్యవహారం ఫలితాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో తప్పు చేసినట్లుగా భావించడం లేదన్నారు. ఎవ్వరూ సాహసించని కార్యానికి తాను పూనుకున్నానని ఈనాడు ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో కూడా పెద్ద నోట్లు రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని.. కానీ ఎన్నికలకు భయపడి ఇందిర ఆ ప్రతిపాదన అమలు చేయలేదని చెప్పారు. అప్పుడే పెద్దనోట్లు రద్దు చేసుంటే చాలా సమస్యలు తీరిపోయేవన్నారు. సమాంతర ఆర్థిక వ్యవస్థ.. పెరుగుతూపోయి.. అధికారిక వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని దేశాన్ని ముందుకు నడపాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందన్నారు. నోట్ల రద్దు వల్ల రహస్య అరల్లో దాగిన లక్షల కోట్ల రూపాయలు బయటికి తీయాల్సి వచ్చిందన్నారు. 3 లక్షల సూట్‌కేసు కంపెనీల బాగోతం బయటపడిందన్నారు. ఐటీ రిటర్న్స్‌ దాఖలుచేసేవారి సంఖ్య ఈ అయిదేళ్లలో రెట్టింపయిందని.. 2014లో డిజిటల్‌ లావాదేవీలు ప్రతినెలా 3 లక్షలు జరిగితే ఇప్పుడు ఆ సంఖ్య 80 కోట్లకు చేరిందన్నారు.

ఆర్థిక నేరగాళ్లను రప్పిస్తాం
నోట్లరద్దు సక్సెస్

ఆర్థిక నేరగాళ్లను రప్పిస్తాం

70 ఏళ్ల కాంగ్రెస్‌ హయాంలో ఎందరో నేరగాళ్లు దేశం పారిపోయారని ప్రధాని ధ్వజమెత్తారు. వారిని రప్పించడానికి కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నాలు చేసిందా అన్ని విషయం పరిశీలించాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మోసం చేసిందని..తాము మిషెల్, సక్సేనా, తల్వార్‌లాంటి ఆర్థిక నేరగాళ్లను విదేశాల నుంచి పట్టుకొచ్చామన్నారు. చట్టబద్ధమైన మార్గాలన్నింటినీ ఉపయోగించుకొని నేరగాళ్లను తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుటికే వారి ఆస్తులను జప్తుచేశామని.. న్యాయపోరాటంలోనూ విజయం సాధిస్తున్నామని చెప్పారు.

ఆర్థిక నేరగాళ్లను రప్పిస్తాం

ఇవీ చూడండి:

Last Updated : Apr 9, 2019, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details