ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా దేశప్రజల సేవకు నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన అనంతరం మోదీ 2.0 ప్రభుత్వ తొలి 10 వారాల ప్రగతి నివేదికను ఆవిష్కరించారు ప్రధాని. 70 ఏళ్లలో చేయలేని ఎన్నో పనులను 70 రోజుల్లో చేసి చూపించామని చెప్పారు.
'70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'
ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని. 70 ఏళ్లలో చేయలేనిది 70 రోజుల్లో చేసి చూపించామంటూ.. మోదీ 2.0 ప్రభుత్వ తొలి 10 వారాల ప్రగతి నివేదికను వేదికగా ఆవిష్కరించారు.
'70 ఏళ్లల్లో చేయలేనిది 70 రోజుల్లో పూర్తి చేశాం'
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను నిజం చేసినట్టు తెలిపారు. ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్టు వివరించారు. రైతులకు పింఛను వంటి నిర్ణయాలు ప్రస్తావించారు.
తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు న్యాయం చేశామని మోదీ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు.
Last Updated : Sep 27, 2019, 1:54 AM IST