ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు బదరీనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. కేదార్నాథ్ ఆలయంలోని రుద్రగుహలో ధ్యానముద్ర ముగించుకున్న మోదీ.. నేడు బదరీనాథ్‌లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడినుంచి సాయంత్రం దిల్లీ బయల్దేరి వెళతారు.
ధ్యానం ముగించిన ప్రధాని మోదీ... - ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఆలయ రుద్రగుహలో శనివారం ప్రారంభించిన ధ్యానం నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయటకు వచ్చారు. అనంతరం బదరీనాథ్ ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం దిల్లీకి బయల్దేరనున్నారు.
ధ్యానం ముగించిన మోదీ
ఎన్నికల ప్రచార పర్వం ముగియగానే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు మోదీ. ఉత్తరాఖండ్‌లోని పవిత్రస్థలం కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. అనంతరం రుద్రగుహకు వెళ్లిన ప్రధాని.. యోగ ముద్రలో ధ్యానం చేశారు.
Last Updated : May 19, 2019, 9:03 AM IST