తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామ మందిర పరిసరాల్లో మొబైల్​ ఫోన్లపై నిషేధం! - ayodhya latest news

అయోధ్యలోని రామ మందిర పరిసర ప్రాంతాల్లో మొబైల్​ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Mobile phones banned in Ram temple area in Ayodhya
రామాలయ పరిసరాల్లో మొబైల్​ ఫోన్లపై నిషేధం!

By

Published : May 11, 2020, 2:02 PM IST

అయోధ్యలోని రామ జన్మభూమి పరిసర ప్రాంతాల్లో మొబైల్​ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. ఆదివారం శ్రీరామ క్షేత్ర ట్రస్టు సభ్యులతో సంప్రదించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు ప్రకటించింది.

గతంలో తాత్కాలిక ప్రదేశం నుంచి కొత్తగా నిర్మిస్తోన్న ఆలయానికి రామ్​లల్లా విగ్రహాన్ని తరలించే సమయంలో పూజారులు, కార్మికులకు మొబైల్​ ఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కేవలం జిల్లా అధికారులు, భద్రతా సిబ్బందికి చరవాణి వినియోగించేందుకు అనుమతినిచ్చారు అధికారులు.

"భద్రతా పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులు.. ఆలయం, పరిసర ప్రాంతాల చిత్రాలను మొబైల్​ ఫోన్లతో తీస్తున్నారు. ఇది ప్రమాదకరమైనదని భావిస్తున్నాం."

చంపత్​ రాయ్​, ట్రస్టు కార్యదర్శి

ఫోన్ల నిషేధంపై ట్రస్టు సభ్యుల నిర్ణయాన్ని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర స్వాగతించారు.

ABOUT THE AUTHOR

...view details