లద్దాఖ్‌లోని కార్గిల్ జిల్లాలో 145 రోజుల తరువాత మొబైల్ అంతర్జాల సేవలను పునరుద్ధరించారు . ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్టు 5న ఇంటర్నెట్ను నిలిపివేశారు. కార్గిల్‌లో గత నాలుగు నెలల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోనందున అంతర్జాల సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించారు అధికారులు.
145 రోజుల తరువాత మొబైల్ ఇంటర్నెట్ పునరుద్ధరణ - jammu kashmir and ladakh internet services
కార్గిల్‌లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. 145 రోజుల సుదీర్ఘ నిలిపివేత తరువాత తొలిసారిగా కార్గిల్ ప్రజలు అంతర్జాలాన్ని వినియోగించుకుంటున్నారు.
145 రోజుల తరువాత మొబైల్ ఇంటర్నెట్ పునరుద్ధరణ
ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయవద్దని స్థానిక మత పెద్దలు సహా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్గిల్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి:నిజాయితీ టైలర్: నేతలిచ్చిన కానుకలు సరాసరి గుడికే!