రెండు రోజులు పాటు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో పరిస్థితులు మారిపోయాయి. నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అఖ్నూర్ సెక్టార్లో భారత సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా మోర్టార్ షెల్స్ వర్షం కురిపించింది పాక్.
ఉదయం 3 గంటలకు ప్రారంభమైన గుండ్ల మోత 6.30 వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. భారత సైన్యం దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు.