తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో 67 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

గుజరాత్​ రాజ్యసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్​కు కొత్త చిక్కులు వచ్చాయి. రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేసిన పార్టీ.. మిగిలిన సభ్యులను జైపుర్​కు తరలించింది.

gujarath
గుజరాత్​

By

Published : Mar 17, 2020, 6:40 AM IST

Updated : Mar 17, 2020, 7:18 AM IST

గుజరాత్​లో 67 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

గుజరాత్​లో రాజీనామా చేసిన తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది కాంగ్రెస్​. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 67 మంది ఎమ్మెల్యేలను జైపుర్​కు తరలించింది. ఒక ఎమ్మెల్యే అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.

గుజరాత్​లో 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను స్పీకర్​ ఆమోదించారు. ఫలితంగా 182 సీట్లున్న గుజరాత్​ శాసనసభలో కాంగ్రెస్​ బలం 68కి పడిపోయింది. భాజపాకు 103 మంది సభ్యులు ఉన్నారు.

ఒక స్థానం కోసం!

ప్రస్తుతమున్న బలం ప్రకారం.. భాజపాకు రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందన్న నమ్మకంతో మూడో అభ్యర్థిని బరిలో నిలిపింది భాజపా. కాంగ్రెస్‌ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది. రాజ్యసభ ఎన్నికల కోసం భాజపా తమ పార్టీ ఎమ్మెల్యేలపై వల వేస్తోందని భావించిన కాంగ్రెస్‌.. సభ్యులను జైపుర్​కు తరలించింది.

Last Updated : Mar 17, 2020, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details