మైసూరులోని కేఆర్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్.ఆర్. మహేశ్ కొత్త ఏడాది సందర్భంగా కుటుంబంతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ దిగీ దిగగానే ఓ కోతి చనిపోయిందని మహేశ్‌కు ఫోన్ అందింది. అంతే వెంటనే ఇంటిల్లిపాది సింగపూర్ నుంచి తిరుగుపయనం అయ్యారు. ఒక కోతి చనిపోతే ఎమ్మెల్యే ఇంతలా స్పందించడం ఏంటని అనుకుంటున్నారా?
మూడేళ్లుగా...
మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే మహేశ్ పొలంలో వానర సంచారం ఎక్కువగా ఉండేది. కోతులు పంటంతా నాశనం చేసేవి. కొద్ది రోజుల తర్వాత ఆ కోతులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఒక్క వానరం మాత్రం అక్కడే ఉండిపోయింది. అప్పటి నుంచి ఆ వానరాన్ని చేరదీసి ప్రేమగా చూసుకుంటున్నారు మహేశ్. దానికి చింటూ అని పేరు కూడా పెట్టారు.
ఇటీవల కొత్త ఏడాదిని జరుపుకునేందుకు కుటుంబంతో కలిసి సింగపూర్ వెళ్లారు మహేశ్. జనవరి 4వరకు అక్కడే ఉండేలా ప్రణాళిక వేసుకున్నారు. ఇంతలోనే చింటూ విద్యుదాఘాతం వల్ల చనిపోయిందని వార్త అందింది. వెంటనే కుటుంబసభ్యులంతా తిరిగి వచ్చారు.
మనుషులతో సమానంగా ఈ వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు మహేశ్.
కోతి మృతితో సింగపూర్ ట్రిప్ మధ్యలో ఆపేసిన ఎమ్మెల్యే ఇదీ చూడండి : 'మరింత దృఢంగా భారత్-అమెరికా స్నేహబంధం'