తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాకు ఓటేయకుంటే అంతే సంగతులు' - ramesh katara

"మాకు ఓటేయకుంటే గ్రామంలో ఎటువంటి పనులు జరగవు" అంటూ ప్రచారంలో భాగంగా ప్రజలను ఓ భాజపా ఎమ్మెల్యే హెచ్చరించారు. పోలింగ్​ కేంద్రాల్లోని కెమెరాల ద్వారా అన్ని గమనిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

'మాకు ఓటేయ్యకుంటే అంతే సంగతులు'

By

Published : Apr 17, 2019, 6:34 AM IST

Updated : Apr 17, 2019, 7:48 AM IST

'మాకు ఓటేయ్యకుంటే అంతే సంగతులు'

ఓటర్లను బెదిరిస్తున్న గుజరాత్​ ఫతేపురా ఎమ్మెల్యే రమేశ్ కటారా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. భాజపాకు ఓటు వేయకుంటే గ్రామంలో ఎటువంటి పనులు జరగవని హెచ్చరించిన మాటలు వీడియోలో ఉన్నాయి.

" ప్రస్తుతం పోలింగ్​ కేంద్రా​ల్లో మోదీ కెమెరాలు పెట్టారు. ఎవరు భాజపాకు ఓటేస్తున్నారో... ఎవరు కాంగ్రెస్​కు వేస్తున్నారో తెలిసిపోతుంది." -రమేశ్ కటారా, ఫతేపురా భాజపా ఎమ్మెల్యే.

ఈ విషయంపై ఒక రోజులోగా వివరణనివ్వాలని రమేశ్ కటారాకు నోటీసులు జారీ చేశారు దాహోడ్ కలెక్టర్ వీ.ఎల్.ఖరాడి.

మార్ఫింగ్​ చేశారు: కటారా

దురుద్దేశంతో ఈ వీడియోను మార్ఫింగ్​ చేశారని కటారా ఆరోపిస్తున్నారు. గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడం వల్ల ఓటింగ్​పై వారికి అవగాహన కల్పించేందుకే మాట్లాడానన్నారు.

ఫతేపురా అసెంబ్లీ స్థానం దాహోడ్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాహోడ్​ నుంచి భాజపా తరఫున కేంద్ర మంత్రి జశ్వంత్​ సింగ్​ బాభోర్​ పోటీలో ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగాఈ నెల 23న గుజరాత్​లోని 26 నియోజకవర్గాలకు పోలింగ్​ జరగనుంది.

ఇదీ చూడండి: బంగాల్​లో విదేశీ నటుడి ప్రచారంపై కేంద్రం ఆగ్రహం

Last Updated : Apr 17, 2019, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details