తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్​' నిందితుడిపై బహిష్కరణ వేటు - సెంగార్​

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఉన్నావ్‌’ బాధితురాలి హత్యాయత్నం కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్​పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది.

'ఉన్నావ్​' నిందితుడిపై బహిష్కరణ వేటు

By

Published : Aug 1, 2019, 1:41 PM IST

ఉన్నావ్ అత్యాచార ఘటన జరిగి ఏడాదిన్నర పూర్తయింది. బాధితురాలిపై హత్యాయత్నం జరగడం, విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న నేపథ్యంలో కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది.

బాధితురాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడం వల్ల ఉన్నావ్‌ అత్యాచార ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది. నిందితుడు సెంగార్‌, అతడి బంధువులు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆమె ప్రయాణిస్తోన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ నంబర్‌ ప్లేట్‌ మీద నలుపు రంగు పెయింట్‌ ఉండటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.

ఈ వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీంలో విచారణ జరుగుతోంది. బాధితురాలికి రక్షణగా నియమించిన ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్​ వేటు పడింది.

ABOUT THE AUTHOR

...view details