తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెచ్​సీక్యూ ట్రయల్స్​ నిలిపివేతపై భిన్నాభిప్రాయాలు

కరోనాపై పోరులో హైడ్రాక్సీక్లోరోక్విన్​ ట్రయల్స్​ను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయంపై భారత వైద్య నిపుణుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. డబ్ల్యూహెచ్​ఓ నిర్ణయానికి కట్టుబడి హెచ్​సీక్యూ వినియోగాన్ని నిలిపివేయాలని కొందరు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Mixed opinion by Indian experts on WHO's temporary pause on hydroxychloroquine trial
'హెచ్​సీక్యూపై భారత్​దే తుది నిర్ణయం'

By

Published : May 26, 2020, 10:26 PM IST

హైడ్రాక్సీక్లోరోక్విన్​ ట్రయల్స్​ను కరోనాపై జరుగుతున్న అధ్యయనాల నుంచి తాత్కాలికంగా తొలిగించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్​ఓ). ఈ నిర్ణయంపై భారత వైద్యుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇకపై దేశంలోని వైద్య కేంద్రాలు.. హైడ్రాక్సీక్లోరోక్విన్​ను కరోనా బాధితులకు అందించే చికిత్స నుంచి తప్పించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే డబ్ల్యూహెచ్​ఓ నిర్ణయానికి భారత్​ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కొందరు చెబుతున్నారు.

హెచ్​సీక్యూ, క్లోరోక్విన్​ లేదా.. అజిత్రోమైసిన్​-హెచ్​సీక్యూ, క్లోరోక్విన్​ కాంబినేషన్​లో చికిత్స అందించిన బాధితుల్లో హృద్రోగ సమస్యలు అధికమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉందని లాన్​సెట్​ అనే అధ్యయనంలో తేలినట్టు దిల్లీలోని ఊపితిత్తుల వైద్యుడు డా. అరవింద్​ కుమార్​ తెలిపారు.

15 వేలమంది రోగులపై ఈ అధ్యయనం చేశారు. అనంతరం ఔషధం తీసుకోని వారి ఆరోగ్య వివరాలతో పోల్చి చూశారు.

అయితే హెచ్​సీక్యూపై తుది నిర్ణయం భారత్​దే అని ఇతర వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

"ఇది మార్గదర్శకం మాత్రమే. కచ్చితంగా పాటించాలని ఏం లేదు. అందువల్ల ఈ విషయంలో ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి భారత్​కు పూర్తి స్వేచ్ఛ ఉంది. హెచ్​సీక్యూతో ముందుకు వెళ్లాల్లో.. లేకపోతే ఇక్కడితే ఆగిపోవాలో.. భారత్​ ఇష్టం."

-- డా. రాజేశ్​ గుప్త, పల్మనాలాజీ అండ్​ క్రిటికల్​ కేర్​ అడిషనల్​ డైరక్టర్​, ఫోర్టిస్​ నోయిడా.

అయితే ఇతర నిపుణుల సూచనలను కూడా పరిగణించి నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే 'హెచ్​సీక్యూను ఇంకా ఎందుకు వాడుతున్నార'ని ప్రజల నుంచి అనేక సందేహాలు వెల్లువెత్తుతాయని రాజేశ్​ పేర్కొన్నారు.

ప్రాణాంతక కరోనాపై పోరులో హైడ్రాక్సీక్లోరోక్విన్​ను ఒక గేమ్​ ఛేంజర్​గా భావించారు అనేకమంది వైద్య పరిశోధకులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈ ఔషధ వినియోగానికి విపరీతంగా మద్దతు తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలకు భారత్​ ఈ మందును సరఫరా చేసింది.

అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్​తో హృద్రోగ సమస్యలు పెరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశముందని గతవారం లాన్​సెట్​ ఓ అధ్యయనంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో క్లినికల్​ ట్రయల్స్​లో హైడ్రాక్సీక్లోరోక్విన్​ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది డబ్ల్యూహెచ్​ఓ.

ABOUT THE AUTHOR

...view details