తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌర సేవల్లో 'మిషన్​ కర్మయోగి'​ కీలక సంస్కరణ: మోదీ - Future

'మిషన్​ కర్మయోగి'కి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయటంపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ సహా ఇతర నేతలు. దూరదృష్టితో చేపట్టిన కీలక సంస్కరణగా పేర్కొన్నారు. సాంకేతక పరిజ్ఞానం, పారదర్శకతతో పౌర అధికారులను మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడమే ఈ మిషన్​ లక్ష్యమని తెలిపారు.

Mission Karmayogi
'పౌర సేవల ప్రక్షాళనలో 'మిషన్​ కర్మయోగి'​ కీలక సంస్కరణ'

By

Published : Sep 3, 2020, 5:20 AM IST

Updated : Sep 3, 2020, 6:55 AM IST

పౌరసేవల సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూపొందించిన 'కర్మయోగి మిషన్'​కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్​పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు.

కర్మయోగి మిషన్​ పౌర సేవల ప్రక్షాళనలో భారీస్థాయి సంస్కరణగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఈ మిషన్​ ప్రభుత్వ మానవ వనరుల నిర్వహణలో మెరుగైన ఫలితాలను ఇస్తుందన్నారు.

ఐగాట్​-కర్మయోగి ప్లాట్​ఫామ్​ అనేది హెచ్​ఆర్​ మేనేజ్​మెంట్​, నిరంతర అభ్యాసంలో మార్పులకు శ్రీకారం చుడుతుంది. సాంకేతక పరిజ్ఞానం, పారదర్శకతతో పౌర అధికారులను మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడమే ఈ మిషన్​ లక్ష్యం.

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

మైలురాయి..

పౌర సేవల విభాగంలో మిషన్​ కర్మయోగి అనేది 21వ శతాబ్దంలో కీలక సంస్కరణగా, మైలురాయిగా నిలుస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు పరిస్థితులకు పౌర అధికారులను సిద్ధం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మిషన్​ సరికొత్త పని సంస్కృతిని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు నిరంతర శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.

దూరదృష్టి..

మిషన్​ కర్మయోగి కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పౌర అధికారుల్లో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచుతూ.. వారి సామర్థ్యాని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఇది దూరదృష్టితో తీసుకున్న సంస్కరణగా తెలిపారు. ఐగాట్​ కర్మయోగి ప్లాట్​ఫామ్​ ద్వారా ఎక్కడి నుంచైనా దేశంలోని 2.4 కోట్ల మంది పౌర అధికారులు నేర్చుకోవటమే కాదు.. సమస్యలకు అంతర్జాతీయస్థాయిలో పరిష్కారం సూచించే వీలుకలుగుతుందన్నారు.

ఇదీ చూడండి: పౌర సేవల ప్రక్షాళనకు 'కర్మయోగి మిషన్'

Last Updated : Sep 3, 2020, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details