లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సెలూన్ షాపులను తెరవడానికి అనుమతిచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మూడు నెలల సుదీర్ఘ కాలం తర్వాత ముంబయిలో సెలూన్ షాపులు తెరుచుకున్నాయి. కానీ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం పార్లర్లు, సెలూన్‌పై యథావిధిగా ఆంక్షలు కొనసాగనున్నాయి.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే వినియోగదారులకు అనుమతినివ్వనున్నట్లు సెలూన్ షాపుల యజమానులు చెబుతున్నారు. అయితే సెలూన్‌కు రావడానికి ప్రజలు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. షాపుల్లో పనిచేసేందుకు సిబ్బంది రాకపోవడం వల్ల తెరిచిన కొంత సమయానికి షాపులను మూసివేశారు యజమానులు.