కర్ణాటక దావణగిరిలోని ఓ ప్రైవేటు ల్యాబ్ చేసిన నిర్వాకం నవజాత శిశువు మృతికి కారణమైంది. శిశువు తల్లికి కరోనా పాజిటివ్ అని తప్పుడు నివేదిక ఇవ్వటమే ఇందుకు కారణం. కరోనా ఉందని శిశువు జన్మించాక తల్లి నుంచి వేరుగా ఉంచారు. శ్వాసకోశ ఇబ్బందితో చిగాతెరి ఆసుపత్రిలో 6 రోజుల తర్వాత ఆ శిశువు మృతి చెందింది.
ఓ ప్రైవేటు ల్యాబ్‌లో జూన్ 18న కరోనా పరీక్ష చేయించుకుంది ఆ గర్భిణీ. నివేదికల్లో పాజిటివ్‌గా రావటం వల్ల జిల్లా ఆసుపత్రిలో చేరింది. ప్రసవం జరిగిన తర్వాత శిశువును ఐసీయూలో ఉంచారు. ఆమె ఎలాంటి కంటైన్మెంట్ జోన్లో లేనందున మరోసారి బెంగళూరు ల్యాబ్‌లో పరీక్షించగా నెగటివ్‌గా వచ్చింది. అయితే అప్పటికే శిశువు మరణించింది.