కర్ణాటక హవేరీ జిల్లాలో ఓ వింత చోటు చేసుకుంది. హంగల్ తాలూకా తిలువళ్లి గ్రామానికి చెందిన సునంద నోట్లో నుంచి వెంట్రుకలు, బంకమట్టి పాత్రలు బయటపడ్డాయి. సునంద కుటుంబం అంటే గిట్టనివారెవరో.. వశీకరణం లేదా చేతబడి చేసి ఉంటారని ఆమె బంధువులు అనుమానిస్తున్నారు.
మహిళ నోట్లో నుంచి వెంట్రుకలు, మట్టి పెళ్లలు..? - మహిళ నోట్లో నుంచి వెంట్రుకలు, మట్టి పెళ్లలు
కర్ణాటకలో ఓ మహిళ నోటి నుంచి వెంట్రుకలు, వింత ఆకారంలో ఉన్న చిన్న మట్టి పాత్రలు బయటపడ్డాయి. శత్రువులెవరో బాణామతి చేయించడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు ఆమె బంధువులు.
మహిళ నోట్లో నుంచి వెంట్రుకలు, మట్టి పెళ్లలు..?
బాధితురాల్ని సత్తెనహళ్లిలోని శివాలిబాసవేశ్వర ఆశ్రమంలోని మూఖప్ప స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్లారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం సునంద ఆరోగ్యం కాస్త కుదుటపడింది.
ఇదీ చదవండి:ఉన్నావ్ కేసు: కుల్దీప్ సెంగార్‌కు నేడే శిక్ష ఖరారు!