ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్‌ను కొద్ది నెలలుగా ముగ్గురు అత్యాచారం చేశారు. బాలిక నాలుగు నెలల గర్భవతి అని తెలియడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.
బాలికపై నలుగురు 'అత్యాచారం'.. గర్భం దాల్చగా వెలుగులోకి! - బాలికపై అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుస అత్యాచారాలు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో మైనర్‌పై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన బయటకు పొక్కింది. వారంతా కొద్ది నెలలుగా అత్యాచారం చేయడం వల్ల బాలిక గర్భవతి అయింది.
యూపీలో మరో దారుణం- బాలికపై కొద్ది నెలలుగా అత్యాచారం
బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు పోలీసులే కేసు నమోదు చేశారు. నిందితులకు బాలిక కుటుంబానికి తెలిసినవారని పోలీసుల సమాచారం. బాలికను కొద్ది నెలలుగా వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు వారు వెల్లడించారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
- ఇదీ చూడండి:హత్యా నేరాల్లో యూపీ, బిహార్ టాప్