తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పబ్-జీ అడొద్దన్నాడని అన్ననే చంపేశాడు - మైనర్ బాలుడు

పబ్​-జీకి మరో ప్రాణం బలైంది. అయితే అది గేమ్​ ఆడటం వల్ల కాదు. పబ్​-జీ ఆడొద్దని వారించాడనే కోపంతో సొంత అన్ననే కడతేర్చాడు ఓ మైనర్ బాలుడు.

పబ్-జీ అడొద్దన్నాడని అన్ననే చంపేశాడు

By

Published : Jun 30, 2019, 6:31 AM IST

పబ్​-జీ ఆడొద్దని వారించినందుకు సొంత అన్ననే హత్య చేశాడు ఓ బాలుడు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో జరిగింది ఈ దారుణం.

అసలేం జరిగిందంటే...

మహమ్మద్ షేక్ (19) అనే వ్యక్తి... 15 ఏళ్ల తన తమ్ముడితో పబ్​-జీ ఆడొద్దని వారించాడు. గేమ్ ఆడొద్దన్నాడనే కోపంతో షేక్​ను తొలుత గోడకు బాదాడు తమ్ముడు. అంతేకాకుండా కత్తెరతో దాడికి దిగాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు షేక్​ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు నిర్ధరించారు వైద్యులు.

ఘటనపై ఐపీసీ సెక్షన్​ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక ఎస్​ఐ మమతా డిసౌజ తెలిపారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details