తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచారం జరిగిందని నిప్పంటించుకున్న బాలిక - శరీరానికి నిప్పంటించుకున్న బాలిక

ఓ అబ్బాయి తనను అత్యాచారం చేశాడంటూ ఓ మైనర్​.. తన శరీరానికి నిప్పంటించుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని రేవాలో జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Minor girl sets herself on fire after being raped in MP's Rewa
అత్యాచారం జరిగిందని నిప్పంటించుకున్న బాలిక

By

Published : Oct 11, 2020, 3:07 PM IST

మధ్యప్రదేశ్​లోని రేవాలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్​.. ఈ నెల 7న తన శరీరానికి నిప్పంటించుకుంది. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే నిందితుడు కూడా మైనర్​ అని వివరించారు.

డబోరా సబ్​డివిజనల్​ పోలీస్​ అధికారి బీపీ సింగ్​ ప్రకారం.. ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. అయితే.. తనను అత్యాచారం చేశాడని ఆ బాలిక నిప్పటించుకుంది.

"వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. బాధితురాలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్నది వైద్యులు ధ్రువీకరిస్తారు. నిందితుడిని పట్టుకుని జువనైల్​ కోర్టులో హాజరుపరిచాం."

--- బీపీ సింగ్​, డబోరా సబ్​డివిజనల్​ పోలీస్​ అధికారి.

ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-మైనర్​పై కజిన్స్ అత్యాచారం- బాలికకు 4 నెలల గర్భం

ABOUT THE AUTHOR

...view details