తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం! - హరియాణాలో మైనర్ బాలిక అత్యాచారం

హరియాణాలో 17 ఏళ్ల కూతురిపై దాదాపు 3 సంతవ్సరాలుగా తండ్రి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బంధువుల ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Minor girl raped by her father in Haryana
హరియాణాలో కూతురిపై తండ్రి అత్యాచార

By

Published : Oct 4, 2020, 9:05 PM IST

దేశవ్యాప్తంగా అత్యాచారాల గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. హరియాణాలో 17 ఏళ్ల కూతురిని తండ్రి రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ జరిగింది..

పాల్వాల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. కూతురిపై దాదాపు మూడేళ్లుగా అత్యాచారానికి ఒడిగడుతూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని ఆ బాలికను బెదిరించసాగాడు. కొన్ని నెలల క్రితమే అతడి భార్య మరణించడం వల్ల ఆ బాలికకు ఎవరితోనూ చెప్పుకునే వీలు కూడా లేకుండా పోయింది. చివరికి తండ్రి ప్రవర్తన గురించి బంధువులతో వివరించిందా బాలిక.

వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:బాలికపై నలుగురు 'అత్యాచారం'.. గర్భం దాల్చగా వెలుగులోకి!

ABOUT THE AUTHOR

...view details