తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో మైనర్​ అపహరణ, సామూహిక అత్యాచారం - పిలిభిత్​లో మైనర్​పై అత్యాచారం

హాథ్రస్​ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం నెలకొన్నా ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. పిలిభిత్​ జిల్లాలో మరో మైనర్​ను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. బాలికను గుర్తించిన పోలీసులు.. తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

Minor girl
మహిళలపై అకృత్యాలు

By

Published : Oct 3, 2020, 11:41 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలపై అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పిలిభిత్ జిల్లా బిలాస్​పుర్​లో మరో మైనర్​ను అపహరించిన దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

బాలిక ఆచూకీ గుర్తించిన పోలీసులు.. తిరిగి ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

"బాధితురాలి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశాం. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తాం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తాం."

- జైప్రకాశ్ యాదవ్​, పిలిభిత్ ఎస్​పీ

ఇదీ చూడండి:'హాథ్రస్​'పై దద్దరిల్లిన దిల్లీ- నిరసనల్లో కేజ్రీ

ABOUT THE AUTHOR

...view details