మధ్యప్రదేశ్ ఇందోర్లో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశాడు.
ఇందోర్, లాసుడియాలో సోమవారం ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. లాసుడియాలోని, ఓ కాలనీకి చెందిన బాలుడిని అదే కాలనీలోని మరో బాలిక ఓ ఆన్లైన్ ఆటలో పలుమార్లు ఓడించింది. దీంతో కక్ష పెంచుకున్న బాలుడు.. ఆ బాలికను తలమీద రాళ్లతో కొట్టి చంపేశాడు.