తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూ వివాదంపై రంగంలోకి మానవవనరుల శాఖ - జేఎన్​యూ వివాదంపై హెచ్ఆర్​డీ ఆరా

జేఎన్​యూ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ రంగంలోకి దిగింది. ఈ విషయంపై ఉపకులపతి, విద్యార్థి సంఘాలు, యూజీసీతో సమావేశమైంది. పెంచిన ఫీజులు యూజీసీ భరిస్తుందని విద్యార్థి సంఘాలకు హామీ ఇచ్చింది. అయితే ఉపకులపతిని తొలగించే వరకూ ఆందోళనలు విరమించేది లేదని విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి.

JNU
జేఎన్​యూ

By

Published : Jan 11, 2020, 6:32 AM IST

దిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్​యూ) ఉపకులపతి జగదీశ్‌ కుమార్‌ తొలగింపు సహా ఈనెల 5న జరిగిన దాడి, ఫీజుల పెంపునకు నిరసనగా అక్కడి విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర మానవ మానవరుల శాఖ రంగంలోకి దిగింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి, విద్యార్థి సంఘాలు, యూజీసీతో సమావేశమైంది. పెంచిన ఛార్జీలను యూజీసీ భరిస్తుందని హామీ ఇచ్చింది. అయితే ఉపకులపతిని తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్‌ స్పష్టం చేశారు.

విశ్వవిద్యాలయంలో ఈనెల 5న జరిగిన దాడి వామపక్ష విద్యార్థి సంఘాల పనేనని తేల్చిన పోలీసులు వాస్తవాలను బయటకు తీశారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌, ఆప్‌, వామపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టే పని చేస్తున్నారని ఆరోపించారు.

"వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగమే జేఎన్‌యూలో దాడి చేసినట్లు ఈరోజు తేలింది. వారు తీవ్రమైన హింసకు పాల్పడ్డారు. ఓ ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డారు. తరగతులను ఆపేందుకు దాడి చేశారు. ప్రణాళిక ప్రకారం సర్వర్‌ను ధ్వంసం చేశారు, సీసీ కెమెరాలు కనిపించకుండా చేశారు. వారు చేసే తప్పు దాగి ఉంటుందని ఇలా చేశారు. నాలుగు రోజుల పాటు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఈ రోజు పోలీసులు నిజాన్ని ముందుకు తీసుకువచ్చారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను ఉపయోగించుకునే పార్టీల నేతలు ఎవరు? కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వామపక్షాలను లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ఆ నిరాశ, నిస్పృహలో విద్యార్థులను తప్పుగా వినియోగించుకుంటున్నారు. దొంగే దొంగ అని అన్నట్లు మాట్లాడుతున్నారు."
-ప్రకాశ్‌ జావడేకర్‌, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి

ఇదీ చూడండి: గెజిట్ నోటిఫికేషన్​తో అమల్లోకి వచ్చిన సీఏఏ

ABOUT THE AUTHOR

...view details