దిల్లీ: కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్రం హోంశాఖ బుధవారం జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలు కానున్నాయి.
వీటికి అనుమతి..
*లాక్‌డౌన్ ప్రారంభం నుంచి దేశంలో కొనసాగిస్తున్న రాత్రివేళ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
* జిమ్‌లు, యోగా కేంద్రాలు ఆగస్టు 5 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది.
* భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.