కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా చూస్తూ, ఉత్సవాల్లో సాంకేతికతను ఉపయోగించాలని అన్ని రాష్ట్రాలు, గవర్నర్లు, ప్రభుత్వ కార్యాలయాలను కోరింది. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజేషన్ సహా అన్ని మర్గదర్శకాలను పాటించాలని సూచించింది.
ప్రభుత్వ మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు..
1. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా కార్యక్రమాలు నిర్వహించాలి. హాజరుకాలేని వారికి చేరేలా సాంకేతికతను వినియోగించాలి.
2.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా, పంచాయతీ స్థాయిల్లో ఉదయం 9 గంటలకు జెండా వందనం, జాతీయ గీతాలాపన చేయాలి. సాయుధ దళాల గౌరవ వందనం, నేతల ప్రసంగం అనంతరం జాతీయ గీతాలపనతో ముగించాలి.
3. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక్కచోటికి చేరటం నిషేధించాలి. భౌతిక దూరం పాటించటం, మాస్కులు ధరించటం వంటి మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
4. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బంది వంటి కొవిడ్-19 వారియర్స్ సేవలకు గుర్తుగా ఈ కార్యక్రమాలకు అలాంటి వారిని ఆహ్వానించాలి. అలాగే కొందరు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను ఆహ్వానించొచ్చు.
ఇదీ చూడండి: 6 యూఎన్, 22 భారతీయ భాషల్లో 'పీఎం వెబ్సైట్'