తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్​స్టెక్​ దేశాధినేతలు! - BIMSTEC

దేశ ప్రధానిగా ఈ నెల 30న రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్రమోదీ. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని బిమ్​స్టెక్​ దేశాధినేతలకు ఆహ్వానం పంపారు విదేశాంగశాఖ అధికారులు. ఆహ్వానం మేరకు ఆయా దేశాల నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్​స్టెక్​ దేశాధినేతలు!

By

Published : May 27, 2019, 9:33 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకుంది భాజపా. మోదీ మరోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని బిమ్​స్టెక్ ​(బీఐఎంఎస్​టీఈసీ) దేశాధినేతలకు ఆహ్వానం పంపారు విదేశాంగశాఖ అధికారులు.

ఈ మేరకు బంగ్లాదేశ్​, భూటాన్​, మయన్మార్​, నేపాల్​, శ్రీలంక, థాయ్​లాండ్​ దేశాధినేతలకు ఆహ్వానం అందించారు. వీరితో పాటు మారిషెస్​ ప్రధాని, కిర్గీజ్​ రిపబ్లిక్​ అధ్యక్షుడిని ఆహ్వానించినట్టు తెలిపారు. వీరందరూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, కార్యక్రమానికి బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా హాజరయ్యే అవకాశం లేదు. ఆ సమయంలో ఆమె విదేశీ పర్యటనలో ఉండనున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు ఆహ్వానంపై స్పష్టత ఇవ్వలేదు విదేశాంగ శాఖ. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా రెండోసారి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

2014 తరహాలోనే..

2014లో తొలిసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు మోదీ. ఈ కార్యక్రమానికి అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్​ షరీఫ్​తో పాటు 'సార్క్'​ దేశాధినేతలు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే తన ప్రమాణ స్వీకారాన్ని విదేశీ నేతల సమక్షంలో జరుపుకోవాలని మోదీ భావిస్తున్నారు. అందుకే, ఈ సారి బిమ్​స్టెక్​ దేశాధినేతలతో పాటు మరికొంతమంది విదేశీ నేతలకు ఆహ్వానం పంపారు.

ఇదీ చూడండి : 'అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details