తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కనీస అనుభవం ఉంటేనే సుప్రీంకోర్టులో వాదనలు' - supreme court hearings

సుప్రీంకోర్టు న్యాయవాదులకు కనీస అనుభవ ప్రాతిపదికను అమలు చేయాలని ప్రతిపాదించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. దీనిపై సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

minimum-experience-for-arguments-in-supreme-court-cji
సుప్రీంకోర్టులో వాదనలకు కనీస అనుభవం: సీజేఐ

By

Published : Jan 17, 2020, 5:41 AM IST

Updated : Jan 17, 2020, 6:41 AM IST

సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించే న్యాయవాదులకు కనీస అనుభవ ప్రాతిపదికను అమలు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్​ ఎస్​.ఎ. బోబ్డే ప్రతిపాదించారు. ఎంత అనుభవం ఉండాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​(ఎస్​సీబీఏ)కు సూచించారు.

అత్యవసర విచారణ కోసం పిటిషన్లను మెన్షనింగ్​ అధికారి వద్ద లిస్ట్​ చేయించడంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్​సీబీఏ అధ్యక్షుడు, సీనియర్​ న్యాయవాది దుష్యంత్​ దవె గురువారం జస్టిస్​ బోబ్డే, జస్టిస్​ బి.ఆర్​.గవాయ్​, జస్టిస్​ సూర్యకాంత్​లతో కూడిన ధర్మాసనం ఎదుట ప్రస్తావించినపుడు సీజేఐ ఈ ప్రతిపాదన చేశారు.

Last Updated : Jan 17, 2020, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details