తెలంగాణ

telangana

By

Published : Oct 12, 2020, 10:46 AM IST

ETV Bharat / bharat

కొవిడ్ వార్డుల్లో మినీ లైబ్రరీలు

కరోనా సోకి క్వారంటైన్​ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి కోసం మినీ లైబ్రరీలు ఏర్పాటు చేశారు కర్ణాటక శివమొగ్గలోని వైద్య అధికారులు. రోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Mini-libraries set up in Covid-19 wards in Karnataka
కొవిడ్ వార్డుల్లో మినీ లైబ్రరీలు

కరోనా రోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వినూత్న ఆలోచన చేశారు కర్ణాటక శివమొగ్గలోని వైద్యాధికారులు. వైరస్​​ బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులలోని క్వారంటైన్​ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి కోసం మినీ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. రోగులు ఆరోగ్యం గురించి దిగులతో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మెక్​గన్​ జిల్లా ఆస్పత్రి, సంగర తాలుకా సబ్ డివిజన్ ఆస్పత్రుల్లో ఈ మినీ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి.

" ఇక్కడ కరోనా బారిన పడిన చాలా మంది రోగులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. పుస్తకాలు చదివితే వారికి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడికి గురిచేసే విషయాల గురించి ఆలోచించరు. "

డా.శ్రీధర్​, శివమొగ్గ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​ డైరెక్టర్​

ఈ మినీ లైబ్రరీలో వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని డా. శ్రీధర్ చెప్పారు. వీటిని స్థానిక ప్రచురణకర్తలు, బుక్​షాప్​ యజమానులు విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details