మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు చేపడుతున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. కరోనా పోరులో ముందున్న యోధులకు ధన్యవాదాలు తెలిపేందుకే తొలిసారి ఈ తరహా ప్రదర్శనలు చేపట్టినట్లు ప్రకటనలో వివరించింది.
సైన్యం, నావికాదళం, పోలీసులు పాల్గొన్న మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు ఇప్పటికే పోర్బందర్, హైదరాబాద్, బెంగళూరు, రాయ్‌పుర్, అమృత్సర్, గువాహటిలో పూర్తయ్యాయి. బుధవారం విశాఖపట్నం, నాగ్‌పుర్, గ్వాలియర్‌లో ప్రదర్శనలు జరుగుతున్నాయి.