తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం - one millitant killed in jammu kashmir encounter today

కశ్మీర్​లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గందర్​బల్ జిల్లాలో జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఓ జవానుకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​-ఓ ఉగ్రవాది హతం

By

Published : Nov 12, 2019, 9:55 AM IST

జమ్ముకశ్మీర్​లోని గందర్​బల్ జిల్లాలో ఉగ్రవాదులు-భద్రతా దళాలకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఓ ముష్కరుడిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఓ జవాను గాయపడినట్టు పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవానును సమీప ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కుల్హాన్ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టాయి. తనీఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు ఎదురుదాడి చేశాయి.

చనిపోయిన ఉగ్రవాది వివరాలు ఇంకా గుర్తించలేదని అధికారుల వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details